in

sreeLeela is an Extraordinary woman in real life!

నితిన్ – శ్రీలీల జంటగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ సినిమా రూపొందింది. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో నితిన్ మాట్లాడుతూ, “మా ఫాదర్ కి డిస్ట్రిబ్యూటర్ గా ఫస్టు సినిమా రాజశేఖర్ గారి ‘మగాడు’. ఆ సినిమా హిట్ కావడం వల్లనే మా ఫాదర్ ఈ ఫీల్డ్ లో నిలబడ్డారు” అని అన్నాడు. “ఆ సినిమాతో మా ఫాదర్ నిలదొక్కుకోవడం వల్లనే హీరోగా నేను ఎంట్రీ ఇచ్చాను. అంటే..ఒక రకంగా ఈ రోజున నేను ఇక్కడ నిలబడటానికి కారణం రాజశేఖర్ గారు అనే చెప్పాలి.

రాజశేఖర్ గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం మాకు హెల్ప్ అయింది. అందుకు మా టీమ్ థ్యాంక్స్ చెబుతోంది” అన్నాడు..”శ్రీలీల మంచి డాన్సర్ అని నాకు తెలుసు. ఆమెకి భరతనాట్యం తెలుసు..కూచిపూడి తెలుసు..మంచి హాకీ ప్లేయర్..స్విమ్మింగ్ లో రికార్డు ఉంది..వీణ వాయించడంలో మంచి ప్రవేశం ఉంది..త్వరలో మెడిసిన్ పూర్తి చేయబోతోందనే విషయం తక్కువ మందికి తెలుసు. అందువలన నా దృష్టిలో తను ఎక్స్ట్రా ర్డినరీ ఉమెన్’ అన్నాడు. ఈ నెల 8న తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటూ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు” అని చెప్పాడు..!!

Surekha Vani Daughter Supritha responds over trolling!

sandeep reddy changed the fate of Tripti Dimri overnight!