in

SreeLeela in talks for Pushpa 2 special song!

పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఎవరిని పెడతారనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటివరకు సమంత, దిశా పటాని, కృతి సనన్ పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం శ్రీలీలను ఐటమ్ సాంగ్ లో పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్ట్-1లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించి దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మాస్ ట్యూన్ రెడీ చేశారట..

ఇక ఇలాంటి మాస్ సాంగ్ లో శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని అంతా భావిస్తున్నారట. శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాను నటించిన ప్రతి సినిమాలో తన నటన కన్నా డాన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకోసమే పుష్ప-2 సినిమాలో శ్రీలీలతో ఐటమ్ సాంగ్ ని చేయించాలనే ప్లాన్ లో ఉన్నారట. మరి ఇది కేవలం రూమర్ ఏనా, లేకపోతే నిజంగా శ్రీలీల ఐటమ్ సాంగ్ లో చేస్తుందా అనేది తెలియదు కానీ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తే టాప్ లేచిపోవడం ఖాయం అంటున్నారు..!!

viral: Balakrishna Orders to Remove Jr NTR Flexis at NTR Ghat!

anjali: not comfortable doing bold and intimate scenes