ఇంతటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ శ్రీలీల సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అల్ట్రా స్టైలిష్ పిక్స్ పోస్ట్ చేయడమే కాకుండా, తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాన్స్ తో ముచ్చటించిన శ్రీలీల సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా కనిపించే కమిట్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన శ్రీలీలను ఓ నెటిజన్ మాత్రం ఇబ్బంది పెట్టేశాడు. ఆర్ యు కమిటెడ్? అంటూ సూటిగా ఈ బ్యూటీకి ప్రశ్నను సంధించాడు. ఇక శ్రీలీల కూడా తక్కువేం తినలేదు. “అవును..నా పని విషయంలో నేను కమిటెడ్ గానే ఉంటాను” అంటూ అతనికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఇక ఇదంతా చూసిన శ్రీలీల అభిమానులు ఆ సందర్భంలో ఆమె చాకచక్యంగా వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ శ్రీలీల జోడిగా నటించిన “ఆదికేశవ” మూవీ నవంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది..!!