in

Sreeleela gets crazy offers from other industries!

తెలుగు ఇండస్ట్రీలోకి తారాజువ్వలా దూసుకు వచ్చింది. టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ అవుతుంది అనుకున్న సమయంలో వరుస డిజాస్టర్లు ఆమె కెరియర్ ని దెబ్బతీశాయి. ఛాన్స్ లు  రావటం తగ్గింది సరి కదా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేజారాయి. దీనితో శ్రీలీల డౌన్ అయిపోయింది. ఇక అమ్మడి కెరియర్ అంతే అనుకున్నారు. ఈ సారి కెరటంలా లేచింది. ఒక్క పాటతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. బన్నీ సుక్కు కాంబో మూవీ ‘పుష్ప 2’ లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీలను సంప్రదించి చివరికి శ్రీలీల దగ్గర ఆగారు.

అంతకముందు ఎన్ని ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పినా ఈ సారి తెలివైన నిర్ణయం తీసుకుని ఓకే చెప్పింది. అదే కలిసి వచ్చింది. ఇప్పుడు ‘కిస్సిక్’ సాంగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ద్రుష్టిలో పడింది. మళ్ళీ ఛాన్స్ లు  ఆమె తలుపు తడుతున్నాయి. ఇదే నెలలో నితిన్ తో కలిసి నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ రిలీజ్ కానుంది. తరవాత హిందీలో సైఫ్ అలీఖాన్ వారసుడితో ఒక మూవీ కమిట్ అయ్యింది. కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో ఒక ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది. ఇవి గాక తెలుగులో అక్కినేని వారసులుతో ఫిక్స్ అయ్యిందట..!!

f cube ‘pushpa – the rule’!