
నేను ప్రేమలో ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను ఎలా ప్రేమలో పడతాను’ అని శ్రీలీల ప్రశ్నించింది. తాను ప్రేమలో పడకపోవడానికి గల కారణాన్ని శ్రీలీల వివరించింది. ‘ప్రతిసారి అమ్మ నాతో ఉంటోంది. ఎలా ప్రేమలో పడతాను. లేకలేక మియామీ వెళ్లితే కూడా ఆ సమయంలో మా అమ్మ వెంట వచ్చింది. ఈ పరిస్థితిలో నేను ఎలా ప్రేమలో పడతాన’ అని శ్రీలీల తెలిపింది. ‘మా అమ్మ నా వెంట ఉంటున్నా కూడా నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. నేను ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి’ అని హీరోయిన్ శ్రీలీల తెలిపింది..
