in

Sreeleela breaks down over trolling, nearly quit films!

సినిమా రంగంలో ఎంత గ్లామర్ ఉంటుందో, సోషల్ మీడియాలో అంతకంటే దారుణమైన ట్రోలింగ్ ఉంటుంది. తాజాగా యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. కెరీర్ మొదట్లో నాపై వచ్చే ట్రోల్స్ చూసి చాలా ఇబ్బంది పడేదాన్ని. చిన్నప్పటి నుంచి నేను చాలా సెన్సిటివ్. ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి తట్టుకోలేక రాత్రుళ్లు ఏడ్చేదాన్ని. ఒక దశలో అమ్మ దగ్గరికి వెళ్లి..నేను ఇంక సినిమాలు చేయను, నాకు ఈ వేధింపులు వద్దు..మళ్లీ కాలేజీకి వెళ్లి చదువుకుంటాను అని చెప్పేశాను” అంటూ ఎమోషనల్ అయ్యింది.

నేటి కాలంలో సోషల్ మీడియా వేధింపులు నటీనటుల మానసిక స్థితిని ఎంతలా దెబ్బతీస్తున్నాయో శ్రీలీల మాటల్లో స్పష్టమైంది. కేవలం తారలే కాదు, వారు నటించిన సినిమాలు కూడా ఈ ట్రోలింగ్ వల్ల దెబ్బతింటున్నాయి. అయితే, ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని శ్రీలీల తెలిపింది. ఇప్పుడు ప్రజలు కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఒకరిపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ను గుడ్డిగా నమ్మడం లేదు. ఆ అనుభవాలే నన్ను ఇప్పుడు ధైర్యంగా నిలబడేలా చేశాయి. ఇప్పుడు ఎలాంటి ట్రోలింగ్‌నైనా ఎదుర్కొనే శక్తి నాకు వచ్చింది అని ధీమా వ్యక్తం చేసింది..!!

milky beauty tamannah no more interested in south cinema?

Pawan Kalyan Creative Works shuts down film rumours!