మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆచార్య’ టీజర్, ‘సిద్ధ’ టీజర్ .. తాజాగా విడుదలైన ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. పాటలు కూడా బాగున్నాయి. ఈ చిత్రంలో రాంచరణ్ ఉండడం.. మరో అదనపు ఆకర్షణ. అతనికి జోడీగా పూజా హెగ్డే నటించడం..
మరింత ప్లస్ పాయింట్. ఇలాంటి పెద్ద సినిమా వస్తుంది అంటే మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు కూడా భయపడి సైడ్ ఇచ్చేస్తాయి. అయితే ఓ డబ్బింగ్ సినిమా మాత్రం తగ్గేదే లె అంటూ దూసుకొస్తోంది. ఆ సినిమా మరేదో కాదు కే. ఆర్. కే అంటే కన్మణి. రాంబో. ఖటీజా. కనీసం పలకడానికి పేరు కూడా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఈ సినిమాని జనాలు పట్టించుకుంటరా? అనేది ఒక డౌట్ అయితే చిరు సినిమా పక్కన వస్తే కనీసం ఓపెనింగ్స్ వస్తాయా అనేది మరో డౌట్. అయితే ఈ సినిమాకి స్టార్ బలం చాలానే ఉంది. అలా అని హీరో విజయ్ సేతుపతి గురించి చెప్పడం లేదు.
అతన్ని తెలుగు జనాలు ఇంకా హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదు. విలన్ గా, సహాయ నటుడిగా మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అతని గురించి కాదు చెప్పేది. ఈ మూవీలో సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్ళకి తెలుగులో క్రేజ్ ఎక్కువ. ముఖ్యంగా సమంత సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది..ఇప్పుడు ఆమె ఫుల్ స్వింగ్ లో ఉంది. అలాగే ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ అందిచాడు. ఇన్ని హైలెట్స్ ఉన్న ఈ మూవీ ‘ఆచార్య’ ముందు నిలబడుతుందా? లేక పోటీ ఇస్తుందా అనేది చూడాలి..! పోటీ ఇచ్చే అవకాశాలు అయితే లేవు.. నిలబడితే గెలిచినట్టే..!