
తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా హీరోయిన్‌గా కొనసాగుతూ, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కథానాయికగా మాత్రమే కాకుండా, ఐటెం సాంగ్స్‌లోనూ తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా తన కెరీర్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టింది.
ఒక సినిమా షూటింగ్ సమయంలో తనను ఓ బోల్డ్ సీన్ చేయమని అడిగారని, అందులో ఇంటిమసీ ఎక్కువగా ఉండటంతో తాను అసౌకర్యంగా భావించి నిరాకరించినట్లు చెప్పింది. ఆ విషయం సదరు సౌత్ స్టార్ హీరోకు నచ్చలేదని, సెట్‌లో అందరి ముందే తనపై అరిచి, హీరోయిన్‌ను మార్చేయాలని పేర్కొంటూ, అవమానించాడని తెలిపింది. ఆ సమయంలో తనకు తీవ్రంగా బాధ కలిగిందని తమన్నా వెల్లడించింది. అయితే ఆ హీరో తర్వాత తన వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పినట్లు కూడా తెలిపింది. అయినా, ఆ హీరో ఎవరో మాత్రం చెప్పకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి, చర్చ మొదలయ్యాయి..!!

