యువ హీరో నాగశౌర్య హైస్కూల్ చదువుతున్న రోజుల్లో ఎదురుకున్న విచిత్రమయిన సంఘటన. నాగశౌర్య 9 వ తరగతి చదువుతున్న రోజుల్లో బైక్ మీద స్కూల్ దగ్గరకు వెళ్లేసరికి స్కూల్ బయట తన ఫ్రెండ్ ఒకడు కొంచెం టెన్షన్ గ నిలబడి ఉండటం గమనించారు, ఏంట్రా డల్ గ ఉన్నావు అని పలకరించగానే, అతను, నాకు, నా లవర్ కి నిన్న కొంచం గొడవ అయ్యింది బాబాయ్, ఆ అమ్మాయి కి సారీ లెటర్ వ్రాసి వెయిట్ చేస్తున్నాను అనిచెప్పాడు. నాగశౌర్య ఎక్కడరా ఆ అమ్మాయి అని అడగ్గానే అటుగా సైకిల్ మీద వస్తున్న అమ్మాయిని చుపించాడు, అతన్ని బైక్ ఎక్కించుకొని , బైక్ వీలింగ్ చేస్తూ వెళ్లి ఆ అమ్మాయిని ఓవర్టేక్ చేసి, ఆమె సైకిల్ కి అడ్డంగా బైక్ అపి, వెనక కూర్చున్న ఫ్రెండ్ దగ్గరనుంచి లెటర్ తీసుకొని తానే ఆ అమ్మాయికి ఇచ్చి స్కూల్ కి వచ్చేసారు. దురద అని దీన్నే అంటారు అని అప్పుడు తెలియలేదు పాపం,ఆ తరువాత తెలిసింది. ఫ్రెండ్ కి చాల హెల్ప్ చేశాను అని వీర లెవెల్ లో ఫీల్ అయ్యారు నాగశౌర్య. కాసేపటికి ఆ అమ్మాయి, వాళ్ళ నాన్న, ఒక కానిస్టేబుల్ ని తీసుకొని క్లాస్ కి వచ్చారు, అయిపోయాడురా వీడు అనుకున్నారట నాగశౌర్య,
కానీ విచిత్రం గ శౌర్య ఎవడ్రా అనే అడగ్గానే , ఆశ్ఛర్యం గ నేనే అని లేచిన శౌర్య ని, అమ్మాయిలకి లవ్ లెటర్ ఇస్తావా బయటకు రారా అని వచ్చిన వాళ్ళు అనగానే , శౌర్య కి మైండ్ బ్లాక్. నేను కాదండి ,వీడు ఏదో సారీ లెటర్ అని చెప్పాడు అని తన ఫ్రెండ్ ని చూపించారట. కానీ ఆ ఫ్రెండ్ ప్లేట్ ఫిరాయించి నాకేమి తెలియదు, శౌర్య నే ఇచ్చాడు అని శౌర్య మీద తోసేసాడట.అంతే పట్టరాని కోపం వచ్చిన శౌర్య, అబద్ద్ధం చెప్పిన ఫ్రెండ్ ని నాలుగు పీకి, సర్ లెటర్ వ్రాసింది వాడు ఇచ్చింది మాత్రం నేనే కానీ అది లవ్ లెటర్ అని నాకు తెలియదు వీడు నన్ను ఇరికించాడు అని చెప్పి, ఆ గండం నుంచి బయట పడ్డారు. కానీ విషయం వారి నాన్న గారికి చెప్పేసారు, వెంటనే హైదరాబాద్ నుంచి వాళ్ళ అమ్మ గారిని పిలిపించారు వాళ్ళ నాన్న గారు, కట్ చేస్తే కట్టు బట్టలతో నాగశౌర్య హైదరాబాద్ లో తేలారు. ఆ విధంగా హైదరాబాద్ నగర ప్రవేశం చేసాడు నాగశౌర్య అనే భావితరం హీరో.అసలు ఆ ఏజ్ లో ఫ్రెండ్స్ అంటే చాల ఇంపార్టెన్స్ ఉంటుంది అటువంటిది, ఆ ఫ్రెండ్ ఆలా చేయటం చాల బాధాకరం కదూ.దీని వలన నాగశౌర్య కి చిన్న వయసులోనే తెలిసిన జీవిత సత్యం ఏమిటంటే, ఎవడికి దురద పుడితే వాడే గోక్కోవాలి, మనం గోక రాదు అని.