కెరీర్ ప్రారంభంలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో చాలా హిందీ సినిమా ఆఫర్లను వదులుకున్నాను. ఒకవేళ అలాంటి సీన్లలో నటిస్తే పంజాబీ ప్రేక్షకులు నన్ను ఎలా చూస్తారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఏమనుకుంటారో అని నాలో నేనే మథనపడేదాన్ని. ఇది కేవలం నటన అని మా కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారా? లేదా? అనే భయం కూడా ఉండేది’’ అని సోనమ్ తెలిపారు..
ఈ సందేహాలన్నింటినీ ఒకరోజు తన తల్లిదండ్రుల ముందు పెట్టానని, వారి నుంచి వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె వివరించారు. ‘‘‘సినిమా కోసమే కదా అలా చేసేది. దాని వల్ల సమస్య ఏముంది?’ అని వాళ్లు చాలా తేలికగా అన్నారు. వారి మాటలు విని నేను షాకయ్యాను. ఇన్ని రోజులు ఈ విషయం గురించి వాళ్లతో ఎందుకు మాట్లాడలేదా అనిపించింది. నా భయాలన్నీ ఒక్కసారిగా పోయాయి’’ అని సోనమ్ బజ్వా పేర్కొన్నారు..!!