సోనాలి బింద్రే సౌత్ ఇండస్ట్రీలో తనుకు ఎదురైన అనుభవం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అది చర్చినీయింశంగా మారింది. అమెజాన్ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనాలి బింద్రే..కన్నడ ఇండస్ట్రీలో తనకు ఒక చేదు అనుభవం ఎదురయిందని..కొన్ని తెలుగు సినిమాల్లో నటించా..మధ్యలో ఒకే ఒక కన్నడ సినిమాలో చేశా అంటూ వివరించింది..
కానీ ఆ సినిమాలో నాకు ఎదురైన చేదు అనుభవంతో నేను మళ్ళీ కన్నడలో నటించకూడదని ఫిక్స్ అయ్యా.. ఆ సంఘటన తర్వాత మళ్లీ ఎప్పుడు కన్నడ సినిమాల్లో నటించలేదు అంటూ సోనాలి బింద్రే వివరించింది. అయితే తనకు ఎదురైన చేదు అనుభవం ఏంటి అనేది మాత్రం తాను రివిల్ చేయలేదు. ఇక కన్నడలో సోనాలి బింద్రే నటించిన ఏకైక మూవీ ప్రీత్సే. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర హీరోలుగా నటించారు. ఆ సినిమా షూట్ టైంలోనే తనకు చేదు అనుభవం ఎదురైందంటూ సోనాలి వివరించింది..!!