బాలీవుడ్ భామ, సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందనే ప్రచారం మీడియాలో నిన్న పెద్ద ఎత్తున సాగింది. వేలికి డైమండ్ రింగ్ తొడుక్కున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడమే దీనికి కారణం. అయితే, ఆ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది. అందరినీ బాగా ఆటపట్టించానని అనుకుంటున్నానని కామెంట్ చేసింది..
Sonakshi Sinha gives clarity over engagement rumours!
ఫొటోలో తాను బోలెడన్ని హింట్స్ ఇచ్చానని, ఒక్క అబద్ధం కూడా చెప్పలేదని తెలిపింది. తన సొంత నెయిల్ పాలిష్ బ్రాండ్ ‘సోయిజీ’ని ప్రారంభించే రోజు తనకు నిజంగానే గొప్ప రోజు అని చెప్పింది. తాను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తన కలను నిజం చేసుకోబోతున్నానని తెలిపింది. సోయిజీ నెయిల్ పాలిష్ వేసుకున్న పిక్స్ తో తన కొత్త ప్రేమని మీతో పంచుకున్నానని చెప్పింది.