in

Sonakshi on Reports of Non-Bailable Warrant Issued Against Her!

ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఓ ఈవెంట్‌ నిర్వాహకుడు సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈవెంట్‌ నిర్వాహకుడు అడగడంతో సోనాక్షి మేనేజర్‌ నిరాకరించాడు. దీనిపై సోనాక్షి కూడా స్పందించలేదని సదరు ఈవెంట్ నిర్వాహకుడు కోర్టు మెట్లెక్కాడనేదే ఈ కథనాల సారాంశం.

తాజాగా వీటిపై స్పందించింది సోనాక్షి. తనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయినట్టు వచ్చిన కథానాల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. కొందరు నాపై కావాలనే అబద్ధపు, అసత్యపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై నా స్టేట్‌మెంట్‌ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర పన్నుతున్నాడు.

కాబట్టి అన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సొంతంగా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ ప్రకటనలో తెలిపింది సోనాక్షి.

Shruti Haasan is on board for Chiranjeevi’s next film!

Genelia makes a comeback to acting after a decade!