నేను మంచి సినిమాలు చేస్తున్నాను. మణిరత్నం డైరెక్షన్‌లో ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమా చేశాను. ఇందులో ఏఆర్ రెహమాన్ పాటలకు డ్యాన్స్ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన అవసరం లేదు. ఆ రూమర్స్ తో నాకెలాంటి సంబంధం లేనప్పుడు, నేను ఏ తప్పూ చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన పనికూడా లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను’ అని చెప్పుకొచ్చింది శోభిత.
ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి సినీ ఇండస్ట్రీలో రూమర్స్ కి కొదవ ఉండదు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళపై కూడా ఇలాగే రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఓసారి లండన్ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. సమంతతో విడిపోయిన తర్వాత చైకి శోభిత దగ్గరైందని, అందుకే వీరిద్దరూ జంటగా షికార్లు చేస్తున్నారని కథనాలు వినిపించాయి. ఇక తాజాగా శోభిత ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్ కి చెక్ పడింది..!!