
అక్కినేని ఫ్యామిలీ కోడలు శోభత ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ఆమె తన వివాహజీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక నాగచైతన్యతో కలిసి తరుచూ వెకేషన్‌లకు వెళ్తూ సోషల్ మీడియాలో దర్శనిమిస్తోంది. అయితే, ఆమె ప్రస్తుతం ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది..
శోభిత లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘చీకటిలో’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఆద్యంతం సస్పెన్స్ అంశాలతో ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ లీడ్ రోల్‌లో కనిపిస్తాడు. ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు..!!
