
పాటల రచయిత అనంత శ్రీరామ్ గారు, మంచి రచయిత గ పేరు సంపాందించారు, ముఖ్యంగా ప్రేమ పాటలు బాగా వ్రాస్తారు అని ప్రసిద్ధి, ఆయనది ప్రేమ వివాహం కాదు అయినా అంత మంచి పాటలు వ్రాయడం వెనుక రహస్యం ఏమిటి? అనంత శ్రీరామ్ కాలేజీ రోజుల్లో, ముత్యాల ముగ్గు సినిమా లో రావు గోపాల రావు గారు, ధరల పట్టిక పెట్టి మరి క్రైమ్ కాంట్రాక్టులు చేస్తుంటారు. అలాగే మన శ్రీరామ్ గారు కూడా తన ఫ్రెండ్స్ కి లవ్ లెటర్స్ వ్రాసి పెట్టటానికి రేట్స్ నిర్ణయించి పాకెట్ మనీ సంపాదించారు. ఒక పేజీ లవ్ లెటర్ వ్రాసిస్తే 250 రూపాయలు,4 లైన్స్ కవిత వ్రాస్తే 125 రూపాయలు తీసుకొనే వారట, ఇంపార్టెంట్ ఫ్రెండ్ అయితే ౩౦% డిస్కౌంట్, జనరల్ ఫ్రెండ్ అయితే 20 % డిస్కౌంట్ ఇచ్చేవారట. ఎంత గొప్ప సైడ్ ఇన్కమ్ సోర్స్ చూసారా. ఈయన గారు ఒక 10 ప్రేమ జంటలకు మీడియేటర్ గ వ్యవహరించేవారట. బహుశా ఆ అనుభవం ప్రేమ పాటలు వ్రాయటానికి బాగా ఉపయోగపడినట్లున్నది. మొత్తానికి ఒక కొత్త పార్ట్ టైం జాబ్ ను సృష్టించిన ఘనత అనంత శ్రీరామ్ గారికే దక్కుతుంది.
 
					 
					
