
అది 1986 జంధ్యాల గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు , చంటబ్బాయ్ షూటింగ్ లో వైజాగ్ లో బిజీ గ ఉన్న రోజుల్లో, వారి చిన్న నాటి స్నేహితుడు డాక్టర్ సత్యప్రసాద్ గారు అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ వైజాగ్ లోనే ఉండేవారు. అందువలన తరచూ షూటింగ్ స్పాట్ కి వెళ్లి చిరంజీవి గారిని కలుస్తుండే వారు. అటువంటి సందర్భం లో సత్యప్రసాద్ గారిని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు చిరంజీవి గారు. చంటబ్బాయ్ చిత్రం లో చార్లీ చాప్లిన్ గ కనిపించిన చిరు, లేడీ గెట్అప్ లో కూడా కనిపిస్తారు, దానికోసం మీసం తీసేయవలసి వచ్చింది. హీరో గారికి ఇన్స్పిరేషన్ కోసం షూటింగ్ స్పాట్ లో పని చేస్తున్న వారందరు మీసం తీసి వేయాలి అని డిక్లేర్ చేశారట జంధ్యాల గారు. ఈ విషయం సత్యప్రసాద్ గారికి చెప్పకుండా, రేపు నువ్వు షూటింగ్ స్పాట్ కి రావద్దు అని చెప్పారట చిరు, ఎందుకు, ఏమిటి అని అడగకుండా షూటింగ్ కి వేళ్ళని సత్యప్రసాద్ గారికి, ఆ మరుసటి రోజు తెలిసింది చిరు తనని సైలెంట్ గ ఎంతటి ప్రమాదం నుంచి కాపాడారు అన్న విషయం. తన కోసం తన మిత్రుడు మీసం కోల్పోకూడదు అని ముందు జాగ్రత్త వహించి సత్యప్రసాద్ గారిని మీసం త్యాగం నుంచి కాపాడారు. చిరు ఎంతటి స్నేహశీలి అనేందుకు ఈ సంఘటన ఒక నిదర్శనం.

