సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు కలిసి, శ్రీకర ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్న అద్భుతమైన 3D యానిమేషన్ చిత్రం ‘వాయుపుత్ర’. ఈ చిత్రానికి దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య. 2026 దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హనుమంతుడు మన చరిత్రలో, ఇతిహాసాల్లో అపూర్వ స్థానం కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన ఆయన బలం, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతీక..
శాశ్వత యోధుడైన వాయుపుత్రుడు తరతరాలుగా భక్తులకు ప్రేరణగా నిలుస్తూ వచ్చారు. అలాంటి మహానుభావుడి గాథను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం కేవలం వినోదం కాదు, భక్తిని రగిలించే పవిత్ర దృశ్యం. ఈ సినిమా చరిత్ర, భక్తి, ఆధునిక విజువల్స్ కలయికగా రూపుదిద్దుకుంటోంది. హనుమంతుని అద్భుతమైన శక్తి, విశ్వాసం, శౌర్యాన్ని కొత్త తరానికి అందించడానికి ఈ సినిమా ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. అత్యాధునిక 3D యానిమేషన్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం దృశ్యకావ్యంగా మారబోతోంది..!!