ఈఇద్దరు హీరోయిన్లు అక్క చెల్లెళ్లని చాలా మందికి తెలియదు. ముందుగా అక్క కృతి సనన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ కాగా, తరువాత అక్క బాటలో చెల్లిగా నుపుర్ సనన్ బాలీవుడ్ లో ఫిల్హాల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె కెరీర్ ఇంకా బిగినింగ్ లోనే ఉంది. అయితే ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు ఇప్పుడు తమ సినిమాలతో ఫస్ట్ టైం పోటీ పడనున్నారు. బాలీవుడ్ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించిన తాజా సినిమా “గణపత్”. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ ఆక్షన్ డ్రామా అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది.
ఇక ఇటు నుపుర్ సనన్ లేటెస్ట్ గా తెలుగులో రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కూడా అక్టోబర్ 20న పాన్ ఇండియన్ సినిమా గా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయనుంది. ఇది కో ఇన్సిడెంట్ గా జరుగుతున్నా, ఫస్ట్ టైం అక్క చెల్లెళ్లయిన కృతి, నుపుర్ సనన్ లు తమ సినిమాల ద్వారా పోటీ పడుతుండడం ఆసక్తిగా మారింది. మరి ఈ పోటీ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే అక్టోబర్20 వరకు ఆగాలి..!!