బ్రిజ్ భూషణ్‌కైనా, వైరముత్తుకు అయినా ఒకే నిబంధనలు ఉండాలి. బ్రిజ్ భూషణ్ తమని వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్లతో పాటు ఒక మైనర్ సైతం వ్యాఖ్యలు చేసింది. మీ పార్టీతో సత్సంబంధం ఉన్న వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతోపాటు 17 మంది మహిళలు బహిరంగంగా వెల్లడించాం. దీంతో ఆ వ్యక్తి మా కెరీర్‌ను నాశనం చేశాడు. మమ్మల్ని పరిశ్రమ నుంచి బహిష్కచించేలా చేశాడు. మాకున్న కలలతో పోలిస్తే వైరముత్తు ప్రతిభ గొప్పదేమీ కాదు.
దయచేసి, వైరముత్తు లాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోండి. దాని వల్ల తమిళనాడులోని పని ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయి. సొంత ఇండస్ర్టీ నుంచే బహిష్కరణకు గురైన ఒక మహిళగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఎందుకంటే వైరముత్తుకు ఉన్న రాజకీయ అండతో అతను రెచ్చిపోతున్నాడు. దాని వల్ల అతనికి వ్యతిరేకంగా నాకు మద్దతు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు” అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది..!!