సిల్క్ స్మిత 1970 – 80 దశకం లో వెండి తెర మీద ఆ పేరు ఒక శృంగార ప్రభంజనం. దక్షిణాది లోనే కాదు యావత్ భారత దేశం లో హీరో, హీరొయిన్ లను మించిన ఫాలోయింగ్ పొందిన తార, ప్రేక్షకుల పాలిట మన్మధ బాణం. సినిమాలో ఆమె ఐటం సాంగ్ ఉందంటే చాలు, ప్రేక్షకులు తండోప తండాలుగా థియేటర్లకు తరలి వెళ్లే వారు. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా, మారుమూల కొవ్వలి గ్రామంలో జన్మించిన వడ్లపట్ల విజయలక్ష్మి, వెండి తెర శృంగార తారగా వెలుగొందింది. టచ్ అప్ గర్ల్ గ సినీ రంగ ప్రవేశం చేసి, ఏకంగా నిర్మాతలు, దర్శకులు తన డేట్స్ కోసం పడిగాపులు పడే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు అంటే, 1984 లో ఓసారి..
షూటింగ్ బ్రేక్ సమయం లో ఆమె రిలాక్స్ అవుతూ ఆపిల్ తింటూ కూర్చొని ఉన్నది ఇంతలో డైరెక్టర్ గారి పిలుపు, తింటున్న ఆపిల్ అలాగే ప్రక్కన పెట్టేసి వెళ్ళిపోయింది, అక్కడ ఉన్న మేక్ అప్ సిబ్బంది, సిల్క్ స్మిత సగం తిన్న ఆపిల్ ని వేలం వేస్తే ఓ ఆరాధకుడు,” అక్షరాలా 26 వేలు” చెల్లించి ఆ సగం ఆపిల్ ను దక్కించుకున్నాడు. అది సిల్క్ స్మిత క్రేజ్ అంటే! ఈ రోజుల్లో 26 వేలు తక్కువే కావచ్చు,కానీ ఎనభయిల్లో లక్షలతో సమానం. సినీ ఇండస్ట్రీ లో అంతటి వెలుగు వెలిగిన నటి, విధి వంచించటం తో ఆత్మ హత్య చేసుకొని ప్రేక్షకులను శోక సముద్రంలో ముంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది.