in

siddhu jonnalagadda took loans to return losses for jack!

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా ఊహించిన విధంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో సిద్ధు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడని టాక్ నడిచింది. దానిపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధూ మాట్లాడుతూ కొన్ని ఈ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ..

జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ విషయంలో నాకు బాధ వేసింది. అందుకే రూ.4.75 కోట్లు అప్పు చేసి మరీ తిరిగి ఇచ్చేశాను. అప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. అందుకే అప్పు చేయాల్సి వచ్చింది. ఆ సినిమాతో కొందరు నష్టపోయారు. అది నాకు నచ్చలేదు. అందుకే అలా డబ్బులు ఇచ్చేశాను. డబ్బులు ఇచ్చినందుకు బాధపడట్లేదు. ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పుకొచ్చారు సిద్దు జొన్నలగడ్డ…!!

Shalini Pandey reflects on her “Arjun Reddy” debut!

68 years for DONGA RAMUDU!