తాజా ఇంటర్వ్యూలో శృతి తన డ్రీమ్ రోల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. “స్క్రీన్ మీద మ్యూజిక్ కంపోజర్‌గా కనిపించాలనేది నాకు చాలా కాలంగా ఉన్న కోరిక. నా కెరీర్‌లో అది ఒక ప్రత్యేకమైన పాత్ర అవుతుంది” అని శృతి అన్నారు. కాగా, శృతి హాసన్ తన కెరీర్‌ను గాయకురాలిగా ప్రారంభించారు. తండ్రి కమల్ హాసన్ సినిమా ‘ఈనాడు’ ద్వారా ఆమె సంగీత ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచే పలుచోట్ల పాటలు పాడి వేగంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
శృతి సినిమాల్లో నటనతో పాటు తన గాత్రంతోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సింగర్‌గా విమర్శకుల ప్రశంసలు కూడా ఆమె అందుకున్నారు. అందుకే స్క్రీన్ మీద ఓ మ్యూజిక్ కంపోజర్ పాత్ర చేయాలని ఆమె కోరుకోవడం అద్భుతంగా కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు ఐరన్ లెగ్ అంటూ విమర్శలు చేసినవాళ్లే ఇప్పుడు శృతి హాసన్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’తో తిరిగి ఊపందుకున్న ఆమె, ఇప్పుడు కోలీవుడ్‌లో రజినీ సినిమా వరకు వచ్చి నిలిచారు..!!