
ఎవరి పిచ్చి వారికి ఆనందం అని పెద్దలు ఉరికి అనలేదు..ఈ సామెతను నిజం చేస్తుంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్. శ్రుతికి వచ్చే ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసే అలవాటు ఎప్పటి నుండో ఉందట.. రికార్డు అయినా ఫోన్ కాల్స్ ను కాళీ టైం లో వింటూ ఉంటుందట ఈ అమ్మడు. అంతే కాకుండ తనకు సిగరెట్, పొగాకు వాసన అంటే ఇష్టమని చెప్పింది. అయితే, వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన మాత్రం నచ్చదు అని తెలిపింది..అయితే ఇవన్నీ పెద్దయ్యాక వచ్చిన అలవాట్లు అని క్లారిటీ ఇచ్చింది..చిన్నప్పుడు తనకు ఎరైజర్ నుండి వచ్చే స్మెల్ అంటే కూడా తెగ ఇష్టపడేదని చెప్పింది శృతి.

