in

Shriya Saran reveals husband Andrei Koscheev had hernia surgery!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో కనిపిస్తూ సందడి చేస్తోంది. కొన్నేళ్ల క్రితం వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న అమ్మడు ఒక బిడ్డకు జన్మనిచ్చి..ఆ పాపకు రాధ ని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ఇక నిత్యం భర్తతో షికార్లు, వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్న శ్రీయ సడెన్ గా ఎమోషనల్ గా మారిపోయింది. తన భర్త ఆసుపత్రిలో ఉన్నాడని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అస్సలు శ్రీయ భర్త హాస్పిటల్లో ఎందుకు ఉండాల్సివచ్చిందంటే.. ఆండ్రీ కొశ్చీవ్‌ గత కొన్నిరోజులుగా ‘హెర్నియా’ అనే వ్యాధితో బాధపడుతున్నాడట.

దీంతో ఇటీవలే అపోలోలో జాయిన్ అయిన అతనికి వైద్యులు సర్జరీ చేశారట. ఈ విషయాన్ని శ్రీయ తెలుపుతూ’ నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. అనారోగ్యంతో ఉన్న ఆండ్రీ, రాధను కూడా ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉండేవాడు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇందుకు సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తోపాటు ఉపాసన కొణిదెల, డాక్టర్‌ రజనీష్‌ రెడ్డికి కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా హాస్పిటల్లో భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.

Yami Gautam Joins with NGOs to Support Sexual Assault Victims!

telugu actress karunya chowdary new stills!