in

Shraddha Laugh: Producer ‘Witch’ Trolled!

శ్రద్ధ కపూర్ నవ్వు మీద ప్రొడ్యూసర్ కామెంట్స్
ఇటీవల విజయవంతమైన ‘స్త్రీ 2’లో శ్రద్ధ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు శ్రద్ధను ఎంపిక చేయడానికి ఆమె నవ్వే కారణమని, ఆమె అచ్చంగా దెయ్యంలా నవ్వుతుందని దినేశ్ విజయ్ అన్నారట. ఈ విషయాన్ని స్త్రీ 2 దర్శకుడు అమర్ కౌశిక్‌ వెల్లడించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘స్త్రీ’ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే నిర్మాత దినేశ్ విజయ్ కల్పించుకుని శ్రద్ధా కపూర్‌ పేరును ప్రతిపాదించారని చెప్పారు.

శ్రద్ధా కపూర్‌కి నిర్మాత దినేష్ బిగ్ కాంప్లిమెంట్
ఆ పాత్ర కోసం ఆమెను ఎంచుకోవడానికి కారణం కూడా చెప్పారన్నారు. ఓసారి శ్రద్ధాకపూర్‌, దినేశ్‌ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారని చెప్పారన్నారు. ఆ సమయంలో జరిగిన సంభాషణలో శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్వుతుందని దినేశ్ అన్నారు. అందువల్ల ఈ పాత్రకు శ్రద్ధనే పూర్తి న్యాయం చేయగలదని దినేశ్ తనతో చెప్పారని అమర్ కౌశిక్ వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి..!!

telugu beauty ananya nagalla Making Her Bollywood Debut!

actress Tabu on board for Vijay Sethupathi – Puri Jagannath’s film?