
ఇప్పటికే కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో ‘సూపర్ మ్యాన్’ తరహా కాన్సెప్ట్‌తో ఒక భారీ చిత్రాన్ని పట్టాలెక్కించిన బన్నీ, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మరో మెగా ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ 23వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనకరాజ్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. లోకేష్ ఇప్పటివరకు సౌత్ సినిమాలతో సత్తా చాటినప్పటికీ, ఈ సినిమాతో పూర్తిస్థాయిలో పాన్ ఇండియా దర్శకుడిగా తన ముద్ర వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు..
ఈ చిత్రంలో బన్నీ సరసన నటించే కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బాలీవుడ్‌లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న శ్రద్ధా కపూర్, ‘సాహో’ సినిమాతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధిస్తుండటంతో..ఈ చిత్రానికి ఆమె రాక పెద్ద ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు..ఒకవైపు అట్లీతో వేగంగా షూటింగ్ పూర్తి చేస్తూనే, మరోవైపు లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టును లైన్లో పెట్టడం చూస్తుంటే..అల్లు అర్జున్ కంప్లీట్ పాన్ ఇండియా మార్కెట్ పైనే ఫోకస్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది..!!

