in

shraddha kapoor almost finalized for Pushpa 2 item song!

పుష్ప 2′ స్టార్ కాస్ట్ గురించి చెప్పాలంటే కొన్ని కొత్త ముఖాలు కనిపించే అవ‌కాశం ఉంది. గ‌త పార్ట్‌లో ‘ఊ అంటావా’ పాటలో అల్లు అర్జున్‌తో సమంత రూత్ ప్రభు అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఈసారి ఆ స్థానంలో శ్రద్ధా కపూర్‌ని చూడవచ్చని వార్తలు వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం..పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్‌ కోసం చాలా మంది నటీమణులను సంప్రదించారు. చివరికి శ్రద్ధా కపూర్ వద్ద మేకర్స్ అన్వేషణ ఆగిపోయింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి ఓ ప్రత్యేక ఐటెం డ్యాన్స్‌లో ఆమె కనిపించనుంది..ఇదే జరిగితే సౌత్, నార్త్‌లకు చెందిన ఈ ఇద్దరు పెద్ద స్టార్స్‌ని కలిసి చూడడం ఫ్యాన్స్‌కి మాంచి ట్రీట్ అవుతుంది. అల్లు అర్జున్‌కు జంటగా రష్మిక మందన్న నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్‌లో ‘పుష్ప 2’ విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ ఛావా ను ఢీ కొట్ట‌నుంది. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 5 న విడుదల కానున్నాయి..!!

Trisha rejected Rajamouli’s offer!

happy birthday nivetha Thomas!