కలర్స్ స్వాతి”, బుల్లి తెర నామధేయం,” స్వాతి” వెండి తెర నామధేయం, ఈమెకు పుట్టగానే పెట్టిన పేరు ఏమిటో మీకు తెలుసా? స్వాతి వాళ్ళ నాన్న గారు ఇండియన్ నేవీ లో ఆఫీసర్ గ పని చేసే రోజుల్లో , ఒక అసైన్మెంట్ మీద రష్యా వెళ్లారు, అక్కడే మూడు సంవ్సత్సరాలు ఉండిపోయారు, అప్పుడు రష్యాలో పుట్టిందట మన కలర్స్ స్వాతి. స్వాతి అమ్మ గారికి ప్రసవం చేసిన లేడీ డాక్టర్ పాపా పుట్టగానే ఆమె కు “శ్వేతలానా” అని పేరు పెట్టి బర్త్ సర్టిఫికెట్ రెడీ చేసేసిందట, డెలివరీ చేసిన రష్యన్ డాక్టర్ పేరు కూడా శ్వేతలానా అట. హమ్మా !!! డాక్టరు ఎంత పని చేసింది. డెలివరీ తరువాత తేరుకున్న స్వాతి అమ్మ గారు విషయం తెలుసుకొని..
కుయ్యో, మొర్రో అని పేరు మార్చాలి అనుకుంటే , అక్కడి హాస్పిటల్ వర్గాలు “నియత్, నియత్”, అనేశాయి, ఇక చేసేదేమి లేక అక్కడ నుంచి ముంబై వచ్చిన తరువాత పేరు మార్చరట. స్వాతి వాళ్ళ అన్నయ్య పేరు సిద్దార్థ్ కావటం తో, ఈమెకు స్వాతి అని నామకరణం చేశారట. ఆ తరువాత బుల్లి తెర మీద కలర్స్ అనే ప్రోగ్రాం తో మెరుపులు మెరిపించిన స్వాతి, కలర్స్ స్వాతి గ అందరి మనసులలో నిలిచి పోయారు. ఆ తరువాత కొంత కాలానికి వెండి తెర ప్రవేశం చేసి స్వాతి గ గుర్తింపు పొందారు, మంచి నటిగా పేరు ప్రతిష్టలు పొందారు. ఇదండీ స్వాతి పేరు వెనుక ఉన్న షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ..!!