ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. మహిళాపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు. సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఈ దాడులను ఎదుర్కొంటున్నారు. తాజాగా తమిళ నటి అనిఖా విక్రమన్.. తనపై జరిగిన దాడిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తన మాజీ ప్రియుడు తనపై దాడి చేశాడని ఆరోపించిన అనికా విక్రమన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మాజీ ప్రియుడు ఎన్నో ఏళ్లుగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని నటి అనికా విక్రమన్ ఫిర్యాదులో పేర్కొంది.
బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చెన్నైలో ఉంటున్న సమయంలో తన మాజీ ప్రియుడు తనను కొట్టాడని పేర్కొన్న అనికా విక్రమన్.. ఆ సమయంలో తన ప్రియుడు తనకు క్షమాపణ చెప్పినందుకే ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు అతడిపై ఫిర్యాదు చేశానని తెలిపింది. పదే పదే వేధిస్తున్నాడని అనిఖా ఆరోపించింది. ఇక అనిఖా గాయాలతో ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ అంశం చాలా పెద్ద వివాదానికి దారితీసింది..శారీరకంగా వాడుకొని మానసికంగా తీవ్ర మనోవేదనకు గురి చేశాడని అనిఖా తెలిపింది..!!