
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా థియేటర్స్ కూడా కొన్ని వారల నుండి మూసి ఉన్న సంగతి తెలిసిందే, అయితే లాక్ డౌన్ తరువాత ఎంచక్కా తమ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి.. ముందుల సినిమా థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకునే ఆడియన్స్ కు థియేటర్ల యాజమాన్యం గట్టి షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం..వివరాల్లోకి వెళ్తే, లాక్ డౌన్ తరువాత కూడా సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయడం తప్పనిసరి అంటూ కండిషన్స్ పెట్టనుంది ప్రభుత్వం. దింతో థియేటర్ యాజమాన్యం మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని టికెట్స్ అమ్ముకోలేని పరిస్థితీ ఏర్పడనుంది.. అంటే ఒక ప్రేక్షకుడికి ఇంకో ప్రేక్షకుడికి మధ్య ఒకటి లేదా రెండు సీట్లు కాలిగా ఉండబోతున్నాయి అన్నమాట. దింతో ఫ్యామిలీ అంత కలిసి సినిమాకు వెళ్లిన వేరు వేరుగా కూర్చొని సినిమా చూడక తప్పదు.. సినిమా కంటే మన ఆరోగ్యమే ముఖ్యం కదా, మన ఆరోగ్యం గ ఉంటె భవిషత్తులో ఎన్ని సినిమాలు అయినా కలిసి చూడవచ్చు అంటున్నారు తెలుగు సినిమా అభిమానులు.

