in

shocking: Kajal Aggarwal is not part of ‘Indian 2’

ఇండియ‌న్ 2లో కాజ‌ల్‌ను మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు. అందుకోసం..గుర్ర‌పుస్వారీ, మార్ష‌ల్ ఆర్ట్స్‌ అంటూ ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది కాజల్. చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేసింది. కానీ.. కాజ‌ల్ క్యారెక్ట‌ర్ ఇండియ‌న్ 2లో ఉండ‌ద‌ని, పార్ట్ 3లో ఆమె క‌నిపిస్తుంద‌ని తెలిపాడు శంకర్. ఇండియ‌న్ 2 కోసం కాజ‌ల్‌పై షూట్ చేసిన సీన్స్ మొత్తం పార్ట్ 3లోనే ఉండేలా మార్పులు చేర్పులు చేశాడ‌ట శంకర్.

అందుకే..ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు కాజ‌ల్ దూరంగా ఉంటుంద‌ని అంటున్నారు. అయితే.. గతంలో కూడా ఆచార్య విషయంలో కాజల్‌కు షాక్ ఇచ్చారు మేకర్స్. ఆచార్య మూవీలో కాజ‌ల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నాడు కొరటాల. చిరంజీవి, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో చాలా సీన్స్ షూట్ చేశారు. కానీ.. అనుకోకుండా కాజ‌ల్ క్యారెక్ట‌ర్ మొత్తాన్ని సినిమా నుంచి లేపేశారు. ఇప్పుడు భారతీయుడు 2 విషయంలో కూడా అలాగే జరిగిందని చెప్పాలి..!!

sree vishnu’s heroine Reba Monica John gets a mega project!

change of plans from lady superstar nayanthara!