శోభన్ బాబు గారి మీద కోపం పెంచుకున్న డైరెక్టర్ రేలంగి నరసింహారావు. రేలంగి నరసింహ రావు కి శోభన్ బాబు గారిని, మొదటి సారిగ డైరేక్షన్ చేసే అవకాశం వచ్చింది, కధా చర్చలు మొదలయ్యాయి, ఒక పది రోజుల తరువాత ప్రొడక్షన్ నుంచి కారు రావటం ఆగి పోయింది.. కారణం తెలియదు, తరువాత రచయిత సత్యానంద్ గారి ద్వారా తెలిసింది, తనను ఆ సినిమా డైరెక్టర్ గ తీసేశారని, హీరో ప్రమేయం లేకుండా ఇటువంటి జరగవు కాబట్టి రేలంగి గారు శోభన్ బాబు గారి మీద కోపం పెంచుకున్నారు. ఆ తరువాత ఎక్కడయినా శోభన్ బాబు గారు కనిపించిన, ప్రక్క నుంచి వెళ్లిపోయే వారు రేలంగి గారు. ఒక రోజు నిర్మాత శాఖమూరి రామచంద్ర రావు దగ్గర నుంచి పిలుపు వచ్చింది, వెళ్లి కలిసిన రేలంగి గారికి మనం ఒక సినిమా చేస్తున్నాము హీరో శోభన్ బాబు గారు అని చెప్పారట, వెంటనే రేలంగి గారు నేను డైరెక్టర్ అంటే శోభన్ బాబు గారు ఒప్పుకున్నారా? అని అడిగారట,
అదంతా మేము చేసుకుంటాము మీరు డైరెక్ట్ చేస్తారా లేదా అని అడిగారట, చేస్తాను అని చెప్పి వచ్చేసిన రేలంగి గారి మనన్సులో సందేహం అలాగే ఉంది, నేరుగా శోభన్ బాబు గారి ఇంటికి వెళ్లి, మీ పిక్చర్ డైరెక్ట్ చేయమంటున్నారు మీకు ఏమి అభ్యంతరం లేదు కదా అని అడిగారట. శోభన్ బాబు గారు ఒక చిరునవ్వు నవ్వి, ఇంతకుముందు సినిమా అవకాశం పోవటానికి నేను కారణం కాదు, నిర్మాత తన సినిమా బిజినెస్ చేసుకోవటానికి మీరు డైరెక్టర్ గ ఉంటె కొంత ఇబ్బంది అని, మీరు కాకుండా వేరే వారిని తీసుకున్నారు. అప్ప్పటి నుంచి నా మనసులో మీ గురించి కొంత బాధ మిగిలి పోయింది, మళ్ళి ఇన్ని రోజులకు మనం కలసి పని చేసే అవకాశం కలిగింది, అని రేలంగి గారి అనుమానాలను తొలగించారట. నొప్పించక, తానొవ్వక అన్నట్లు ఉండే శోభన్ బాబు గారిని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు చాలా ఫీల్ అయ్యారట రేలంగి నరసింహ రావు గారు..