సాజిద్ ఖాన్ ని జైల్లో పెట్టాలని షెర్లిన్ చోప్రా పోలీసులను విజ్ఞప్తి చేసింది. సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపులు ఫిర్యాదులు రావడం ఇదేం తొలిసారి కాదు. 2018 లో మీ టూ మూవ్మెంట్ ఉధృతంగా ఉన్న రోజుల్లోనే సాజిద్ ఖాన్ పై బాలీవుడ్ కి చెందిన నటీమణులు, మోడల్స్ వరుసపెట్టి ఆరోపణలు గుప్పించారు. మొత్తం 9 మంది ఆర్టిస్టులు సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసులు పెట్టారు. సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వాళ్లంతా గతంలో అతడితో కలిసి సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో వివిధ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసిన వాళ్లే కావడం గమనార్హం.
షెర్లిన్ చోప్రాతో పాటు సలోని చోప్రా, అహనా కుమ్రా, మందనా కరిమి వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సాజిద్ ఖాన్ తనను నిత్యం ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటావని అడిగాడని ఒకరు ఫిర్యాదు చేస్తే.. నీకెంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగాడని ఇంకొకరు ఫిర్యాదు చేశారు. అన్నింటికిమించి సాజిద్ ఖాన్ తన ప్రైవేట్ పార్ట్స్ చూపించి టచ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడని మరొకరు ఫిర్యాదు చేశారు. ఇలా మొత్తంగా సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసులకు లెక్కేలేదు..!!