శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఓ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ యువత లవ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తి కావాల్సింది. లాక్ డౌన్ తర్వాత సినిమా షూట్ మొదలై చివరకు వచ్చింది. శేఖర్ కమ్ముల అంటే తనకు ఎలా కావాలో అలా సీన్స్ వచ్చే వరకు రీ షూట్ చేస్తూనే ఉంటాడు. గతంలో వచ్చిన సినిమాలు కూడా అంతే. ఇప్పుడు ఆ బాధ లవ్ స్టోరీకి కూడా తప్పటం లేదని తెలుస్తోంది.
రీషూట్స్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. లవ్ స్టోరీ రిలీజ్ డేట్స్ ఇంకాక ఫిక్స్ కాకపోవటం… సినిమాలో నటిస్తున్న వారికి ఇతర సినిమా షెడ్యూల్స్ ఇంకా స్టార్ట్ కాకపోవటంతో చైతూ, సాయి పల్లవి ఇలా అంత ఎక్స్ ట్రా డేట్స్ ఇచ్చేస్తున్నారట. ఫిదా షూటింగ్ సమయంలోనూ ఇలాగే జరిగి మూవీ హిట్ కొట్టగా, ఇప్పుడు కూడా రీ షూట్ జరుగుతుండటంతో సాయి పల్లవికి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.