in

Shalini Pandey supports Deepika Padukone for 8-hour work shift model

దీపికా పదుకొణె లేవనెత్తిన ‘8 గంటల పని’ విధానంపై చర్చ జోరుగా సాగుతోంది. ఈ నిబంధన కారణంగా ఆమెకు కొన్ని పెద్ద సినిమా అవకాశాలు చేజారాయన్న వార్తల నేపథ్యంలో, యంగ్ హీరోయిన్ షాలినీ పాండే దీపికాకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆమె చేస్తున్న డిమాండ్‌లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాలినీ పాండే మాట్లాడుతూ, “ఆ ప్రాజెక్టుల విషయంలో తెరవెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఒక నటిగా దీపిక అంటే నాకు ఎంతో ఇష్టం..

నేను స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను. ఆమె ఒక గొప్ప నటి” అని అన్నారు. అంతేకాకుండా, దీపిక చాలా ధైర్యవంతురాలని, తనకు అవసరమైన దాని గురించి నిర్భయంగా మాట్లాడుతుందని ప్రశంసించారు. “ఆమె ధైర్యం వల్లే ఈరోజు నటీనటులు మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడగలుగుతున్నారు. మేము కూడా మనుషులమే, మాకు కూడా విరామం అవసరం. ఆమె కోరుకుంటున్నది ఆమెకు దక్కాలి. అందులో తప్పేముంది?” అని షాలినీ పాండే ప్రశ్నించారు..!!

Puri Jagannadh about relationship with charmi kaur!