
షారుఖ్ ఖాన్ లుక్ పై కాపీ ట్రోల్ల్స్!
షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “కింగ్” నుంచి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నేడు కింగ్ ఖాన్ పుట్టినరోజు కానుకగా సాలిడ్ టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో షారుఖ్ లుక్ ఓకే కానీ తన గెటప్ కొన్ని షాట్స్ పై గట్టి ట్రోల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఎఫ్ 1 లో హీరో బ్రాడ్ పిట్ లుక్ ని షారుఖ్ తో అచ్చు గుద్దినట్లు దించేయడంతో కాపీ మరకలు పడ్డాయి..
					
					
