ఈమధ్య పాన్ ఇండియా లెవెల్ లో రష్మిక చేసిన సినిమాలన్నీ సక్సెస్ లు అయ్యాయి. రష్మిక సినిమాలో ఉంటే అది సూపర్ హిట్టే అన్న రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. సికందర్ సినిమాకు కూడా రష్మిక లక్ కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ సినిమా ఫేట్ ని రష్మిక ఇమేజ్ మార్చలేకపోయింది. మురుగదాస్ ఓల్డ్ స్కూల్ టేకింగ్ తో పాటు రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చిన సికందర్ సినిమాలో రష్మిక పాత్ర బలంగా ఉన్నా వర్క్ అవుట్ కాలేదు..
ఐతే యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో వరుస సూపర్ హిట్లు అందుకున్న రష్మిక సికందర్ రిజల్ట్ చూసి షాక్ అయ్యిందని చెప్పొచ్చు. ఐతే స్టార్ సినిమా కదా అది కూడా బాలీవుడ్ ఆఫర్ అని తొందపడకుండా కథల విషయంలో జాగ్రత్త పడితే బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే ఇలాంటివి రెండు మూడు ఫెయిల్యూర్స్ పడితే బాలీవుడ్ లో మళ్లీ ఆఫర్లు తెచ్చుకోవడం కష్టం..!!