సినిమా సెట్ లో సిగరెట్ తాగినందుకు సినిమా కోల్పోయిన వెటరన్ నటుడు జగ్గయ్య. ఎందుకు ఆలా జరిగినది , చాల ఇంటరెస్టింగ్ స్టోరీ. నిర్మాత కింగ్ లాగా వెలుగొందుతున్న రోజులు అవి, మోడరన్ థియేటర్స్ అనే నిర్మాణ సంస్థ ” సహస్ర శిరస్చేదా అపూర్వ చింతామణి ” అనే సినిమా నిర్మిస్తున్న రోజులు. మోడరన్ థియేటర్స్ అధిపతి టి.ఆర్. సుందరం గారు క్రమశిక్షణ కు మారుపేరు, సెట్లో” నో స్మోకింగ్” బోర్డులు పెట్టించేవారు ఆయన, అయినా జగ్గయ్య గారు లెక్క చేయకుండా సెట్లోనే సిగరెట్ కాల్చేవారట.
ఎంత మంది చెప్పిన జగ్గయ్య గారు తన అలవాటును కొనసాగించారట. .ఒక సారి జగ్గయ్య గారు సెట్లోనే సిగరెట్ కాల్చటం చూసిన సుందరం గారు, ప్రొడక్షన్ మేనేజర్ ను పిలిచి జగ్గయ్య గారి లెక్క చూసి అయన కు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి పంపించివేశారు. జగ్గయ్య గారితో ఉన్న సీన్లు అన్ని కాల్చివేసి, కాంత రావు గారిని హీరో గ పెట్టుకొని సినిమా తీశారు, ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ విధముగా జగ్గయ్య గారు ఒక మంచి సినిమా కోల్పోవలసి వచ్చింది. టి.ఆర్.సుందరం గారు ఆ రోజుల్లోనే 100 సినిమాలు నిర్మించిన మొట్ట మొదటి నిర్మాత గ పేరు పొందారు..