తెలుగు చిత్ర చరిత్రలో మొదటి తరానికి చెందిన హీరోయిన్ కన్నాంబ గారు, నటనకు నిలువెత్తు నిదర్శనం ఆవిడ. నటిగా ఆమె గురించి అందరికి తెలుసు, ఆమె వ్యక్తిత్వం కూడా విలక్షణమయినది. ఆ రోజుల్లో తెలుగు హీరోయిన్లు, తమిళంలో కూడా నటించేవారు. అప్పట్లో తమిళంలో టాప్ హీరో అయిన, పి.యు, చిన్న స్వామి తో కలసి నటిస్తున్నారు, పి.యు, చిన్న స్వామి గారు కాస్త తీర్ధం సేవించి వచ్చే వారట, దర్శక, నిర్మాతలు కూడా అభ్యంతరం చెప్పలేక మౌనంగా ఉండే వారట. కానీ కన్నాంబ గారు అయన తాగి వచ్చిన విషయం గమనించి..
షాట్ గ్యాప్ లో మనం కళాకారులం, ఇలా తాగి వచ్చి నటించటం కళామతల్లిని అవమానించినట్లే అని నిలదీశారట. సెట్ లో ఉన్న అందరు బిక్క చచ్చి పోయి చూస్తుండగా, చిన్న స్వామి గారు, నిజమే మీరు చెప్పింది ఇంకెప్పుడు ఇలా తాగి నటించను అని ఆమెతో అన్నారట. చిన్న స్వామి చాల కోపధారి అని పేరు ఉండేది, అటువంటి చిన్న స్వామినే ఆమె ప్రశ్నించారు, తప్పు చేసిన వారిని ప్రశ్నించటం లో తప్పులేదు అని నమ్మిన ఆమె ధైర్యానికి అందరు ఆశ్చర్యపోయారు..