in

sequel confirmed for balakrishna ‘Aditya 369’ soon!

బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అదే ఆదిత్య 999. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నున్నట్లు తెలుస్తుంది. గతంలో సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెర‌కెక్కిన ఆదిత్య 369 సీక్వెల్‌గా ఇది రూపొందనుంది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల‌ మధ్య ప్రయాణించిన సైంటిఫిక్ ఫ్రిక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు క్రిష్ మరింత వైవిద్యంగా విభిన్న టైమ్ జోన్‌ను జోడించి మరింత ఇంట్రెస్టింగ్గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

మోక్ష‌జ్ఞ‌ గ్రాండ్ ఎంట్రీ కూడా ఉండనుందట. ఒకటి..ప్రస్తుత కాలం, మరొకటి భవిష్యత్తు, ఇంకొకటి పురాతన కాలానికి చెందిన పాత్రలుగా తెలుస్తుంది. ఇక సస్పెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక..మోక్షజ్ఞ సినిమాలో హీరోగా నటించుకున్న పవర్ఫుల్ పాత్రలో మెరవనున్నాడని సమాచారం..గోపీచంద్ మ‌ల్లినేని డైరెక్షన్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాను బాలయ్య పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్‌పైకి రానున్నట్లు తెలుస్తుంది..!!

producer nagavamshi reveals reason behind Pooja Hegde exit!