సెన్సార్ బోర్డు మీద కోర్ట్ కు వెళ్లిన యెన్.టి.ఆర్. 1980 లో యెన్.టి.ఆర్. నిర్మించి, నటించిన చిత్రం” శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర”. ఈ చిత్రం ఇంతకు ముందు ఎంతో మంది నిర్మించాలని ప్రయత్నించినా చేయలేక పోయారు. యెన్.టి.ఆర్. నిర్మాణం ప్రారంభించిన తరువాత కూడా చాల అవాంతరాలు ఎదురు అయ్యాయి, అయినా ఆయన మొండి గ చిత్ర నిర్మాణం పూర్తి చేసారు. చివరకు సెన్సార్ వారు నాలుగు కట్స్ చెప్పారు, దానికి అంగీకరించని యెన్.టి.ఆర్. రేవైసింగ్ కమిటి కి వెళ్లారు వారు మరో నాలుగు కట్స్ అదనంగా చెప్పటం తో ఆగ్రహించిన యెన్.టి.ఆర్. సెన్సార్ బోర్డు కు వ్యతిరేకం గ కోర్ట్ మెట్లు ఎక్కారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం లో చెప్పిన” విధవ రాజ్యం ఏలుతుంది,
తెర మీద బొమ్మలు రాజకీయాలలోకి వచ్చి రాజ్యాధికారం పొందుతారని”, వంటి విషయాల మీద అభ్యంతరం చెప్పారు సెన్సార్ బోర్డు వారు. ఆ సమయం లో ఇందిరా గాంధీ ప్రైమ్ మినిస్టర్ గ ఉండటం. తెర మీద బొమ్మలు రాజ్యమేలుతారు అన్నప్పుడు తమిళ నాడు సి.ఏం. ఎం.జి.ఆర్.బొమ్మ చూపటం సెన్సార్ వారికి నచ్చలేదు. తాను వాస్తవాలను మాత్రమే చూపించామని, అసత్య ప్రచారమేది చేయలేదనే పాయింట్ మీద యెన్.టి.ఆర్. కోర్ట్ కి వెళ్లారు నాలుగు సంవత్సరాల తరువాత కోర్ట్ యెన్.టి.ఆర్. కి అనుకూలంగా తీర్పు చెప్పటం జరిగింది. అప్పటికి యెన్.టి.ఆర్. స్వయం గ రాజకీయాలలోకి రావటం సి.ఏం. కావటం జరిగిపోయింది.