in

sensational beauty kayadu lohar to romance nandamuri hero!

స్సాం నుంచి వచ్చి కన్నడ చిత్రం ‘మొగిల్ పేట’తో వెండితెరకు పరిచయమైన కయాదు లోహర్, అతి తక్కువ కాలంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ చిత్రంతో అడుగుపెట్టిన ఈమె, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన గ్లామర్ మరియు నటనతో మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం విశేషం.

ఇటీవల విశ్వక్ సేన్‌తో కలిసి ‘ఫంకీ’ మూవీలో సందడి చేసిన కయాదు, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఆమె అందానికి యువత ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని మరియు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ లో ఈమె నటిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం సెట్స్‌పై ఉండగానే, తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన నటించే అద్భుతమైన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించనున్న వెంకటేష్ – కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీలో కయాదును ఎంపిక చేసినట్లు సమాచారం..!!

Jonita gandhi to do an item song for adivi sesh’s dacoit!