అలనాటి స్టార్ హీరోయిన్ టబు 50 వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది టబు. ఇటీవలే రీసెంట్ గా హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అమెరికన్ టీవీ సిరీస్ డూన్: ప్రొఫెసీలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు బాలీవుడ్ లో క్రూ సినిమాతో సూపట్ హిట్ అందుకుంది. వరుస విజయాలతో టబు రేంజ్ మారిపోయింది. ఈ క్రమంలో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది..
డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో టబు కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయినట్లు టాక్. ఈ సినిమాకు సినిమాకు పుస్తక రచయిత, సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ కథ అందించారట. గతంలో టబు, చంద్రసిద్ధార్థ్ కాంబోలో ‘ఇదీ సంగతి’ అనే సినిమా వచ్చింది. టబు తెలుగు సినిమాతోనే నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది..!!