ఫామ్ లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బును వ్యాపారంలోనో, మరే ఇతర రంగంలోనూ పెట్టుబడి పెట్టి దాచుకుంటూ ఉంటారు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సదా కూడా ఇలాంటి పని చేసింది. తాను కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని ముంబైలోని ఓ ప్రాంతంలో రెస్టారెంట్ పెట్టడానికి వెచ్చించింది. ‘ఎర్త్ లింక్స్ కేఫ్’ పేరుతో ఓ వెజిటేరియన్ రెస్టారెంట్ ని ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆ రెస్టారెంట్ బాగా క్లిక్ అయింది. 2019 లో ఈ రెస్టారెంట్ ని సదా ప్రారంభించగా సినీ ప్రముఖులు సైతం అక్కడి వెజ్ ఫుడ్ కి ఫిదా అయ్యారు. సదా కూడా ఆ కేఫ్ ని సొంత బిడ్డలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అన్ని బాగున్నాయనుకుంటున్న తరుణంలో సదా కి ఆ రెస్టారెంట్ బిల్డింగ్ ఓనర్ షాక్ ఇచ్చాడు.
నెలలోపు రెస్టారెంట్ ఖాళీ చేయాలని సదాని ఆదేశించాడట. దీంతో షాక్ అయిన ఆమె ఆ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. ఎంతో బాగా నడుస్తుందనుకుంటున్న రెస్టారెంట్ ని అర్థంతరంగా ఖాళీ చేయమనడంతో సదా ఎమోషనల్ అయింది. ఎంతో కష్టపడి దాన్ని ఏర్పాటు చేసుకున్నానని ఇప్పుడు ఉన్నట్టుండి ఖాళీ చేయమనడం చెప్పడంతో ఏం తోచడం లేదంటూ ఉద్వేగానికి లోనైంది. మరో మూడు వారాలు మాత్రమే గడువు ఉందని ఈలోపు అందరూ రెస్టారెంట్ కి వచ్చి నచ్చిన ఫుడ్ తినేయండంటూ ఏడ్చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సదా కి మద్దతు ఇస్తున్నారు..!!