సీనియర్ నటి రాధ వారసురాలిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ కార్తీక. కో చిత్ర దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కించిన చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అయితే, సినీ రంగంలో అడుగుపెట్టేందుకు తన తల్లి ఇమేజ్ కార్తీకకు సినీ అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఈమె నటించిన అన్నకొడి, పురంబోక్కు వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. కోలీవుడ్ ప్రేక్షకులు ఆమెను ఆదరించకపోవడంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.
Senior Actress radha’s Daughter karthika says Goodbye to Acting!
దీంతో ఆర్నాబ్ అనే హిందీ సీరియల్లో కూడా నటించింది. అయితే, గత రెండేళ్ళుగా ఆమెకు ఒక్క సినీ అవకాశం కూడా రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మున్ముందు కూడా వస్తాయనే ఆశ కూడా కనిపించడం లేదు. దీంతో నటనకు గుడ్‌బై చెప్పి… ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న యూటీఎస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ డైరెక్టరుగా కొనసాగాలని ఆమె నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాదండోయ్.. ఇకపై సినిమాల వైపే కన్నెత్తి చూడరాదన్న కఠిన నిర్ణయంతో ఆమె నటనకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం..