సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి ఉపోద్ఘాతం అవసరం లేదేమో. తెలుగునాట అతగాడికి వున్న క్రేజ్ అంతాఇంతా కాదు. మహేష్ సినిమా రిలీజ్ అయిందంటే ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి. అతని తాజా చిత్రం అయినటువంటి ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్ధంగా వుంది. ఇకపోతే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతుంది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ అందాల తార మరెవ్వరో కాదు. 90sలో తెలుగు పరిశ్రమను ఓ ఏలు ఏలిన వాళ్లలో ఈమె ఒకరు. ఈమె మన మహేష్‌బాబుకి తల్లిగా నటించబోతున్నట్టు టాలీవుడ్లో వార్తలొస్తున్నాయి. అగ్రహీరోలందరి సరసన నటించిన రాధ.. నైంటీస్లోనే సినిమాలకి గుడ్ బై చెప్పడం గమనార్హం. మళ్లీ మహేష్‌బాబు చిత్రంతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనుండడం ఆనందించదగ్గ విశేషం.
అయితే ఈ వార్తల్లో నిజమేంటో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది.1980వ దశకములో దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితోను కలసి నటించింది. తెలుగులో అనేక సినిమాలు చిరంజీవితో నటించింది. చిరంజీవితో ఈమెకు అనేక హిట్ చిత్రాలు వున్నాయి. ముఖ్యంగా డాన్స్ విషయంలో మన మెగాస్టార్ కి ఏమాత్రం తగ్గేది కాదట. ఇక తన కెరీర్ పిక్స్ లో ఉంటుండగానే తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడింది.