కింగ్ నాగార్జున అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `బంగార్రాజు`. 2016 నాటి సంక్రాంతి సెన్సేషన్ `సోగ్గాడే చిన్ని నాయనా`కి కొనసాగింపు చిత్రంగా `బంగార్రాజు` తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో నాగ్ తో పాటు ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. నాగ్ కి తమ్ముడుగా చైతూ.. మనవడిగా అఖిల్ కనిపించనున్నారంటూ కథనాలు వస్తున్నాయి.
senior actress Jayaprada in Nagarjuna’s Bangarraju?
ఇదిలా ఉంటే.. `సోగ్గాడే చిన్ని నాయనా`లో తండ్రి పాత్ర (బంగార్రాజు)కి జోడీగా నటించిన సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ.. సీక్వెల్ లోనూ అదే వేషంలో కొనసాగనుంది. కాగా, మరో ముఖ్య పాత్రలో వెటరన్ యాక్ట్రస్ జయప్రద సందడి చేయనున్నారని సమాచారం. త్వరలోనే `బంగార్రాజు`లో జయప్రద ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో అలరించిన జయప్రద.. ఆయన వారసులు కలిసి నటించనున్న ఈ మల్టిస్టారర్ లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.