ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ మూర్తి ఉంటుంది అన్నది నానుడి, ఆ నానుడి చాల సందర్భాలలో చాల మంది విషయం లో నిజమని నిరూపించబడింది.అపజయమే ఎరుగని దర్శక అజేయుడు, తీసింది పన్నెండు సినిమాలు కానీ గడించింది, విశ్వ విఖ్యాత ఖ్యాతి. 2012 నుంచి 2022 వరకు అంటే ఒక దశాబ్ద కాలం లో అయన దర్శకత్వం వహించింది మూడు సినిమాలే కానీ తెలుగు సినిమా దశ, దిశ ను మార్చేశాడు,అతనే దర్శక దిగ్గజం రాజమౌళి. దేశానికీ రాజయిన అమ్మకు బిడ్డే, అలాగే తన విజయం వెనుక తన తల్లి పాత్ర ఉందని ఎంతో వినమ్రంగా ఒక ఇంటర్వ్యూ లో ప్రకటించారు రాజమౌళి. తన తల్లి తనను చదువుకో అని ఏ రోజు ఒత్తిడి చేయలేదని, టైం ఉంటె ఆడుకో, లేదంటే ఏదయినా నీకు ఇష్టమయిన కామిక్స్ చదువుకో అని ప్రత్సాహించేవారని చెప్పారు. అందుకే తనలోని క్రియేటివిటీ బీజం పడిందని, ఆ జిజ్ఞాసే చిత్ర నిర్మాణం లోని 24 క్రాఫ్ట్స్ పైన పట్టు సాదించేట్లు చేసిందని, అందుకే తన చిత్రాలలో అన్ని క్రాఫ్ట్స్ అవుట్ పుట్ తనకు తృప్తి కలిగేంత వరకు రాజీ పడనని తెలియ చేసారు. తన తల్లి తనను ఎప్పుడు రాంక్ సాధించాలని, డాక్టర్ అవ్వమని, ఇంజినీర్ అవ్వమని తనకు చెప్పలేదని..
ఆమె తనకు అలవరచిన స్వేచ్చాభావప్రకటన సౌలభ్యం వల్లనే తనకు ఇంత సృజనాత్మకత అలవడింది అని భావిస్తున్నట్లు చెప్పారు.తల్లి తండ్రులు తమ ఆస్తులకు వారసులుగా ప్రకటించకపోయినా ఫరవాలేదు, తమ ఆశలకు, తీరని కోరికలకు, అర్ధం పర్ధం లేని ఆశయాలకు పిల్లలను వారసులుగా చేయాలనుకోకూడదు, అనే జీవిత సత్యానికి నిలువెత్తు నిదర్శనం రాజమౌళి గారి తల్లి పెంపకం. అందుకే రాజమౌళి గారి చిన్న తనం ఒక అద్భుతం అని ఆయన చెప్పటం జరిగింది, అది అద్భుతం మాత్రమే కాదు అద్వితీయం కూడా, పిల్లల భవిష్యత్తు చెడ గొట్టాలి అని కాకపోయినా, వారి మీద ఉండే అవ్యాజమయిన ప్రేమతో తల్లి తండ్రులు కొన్ని సందర్భాలలో ప్రతిబంధకాలుగా మారి, వారి పిల్లల ఫ్యూచర్ అంధకారం చేయటం మనందరం చూసే ఉంటాము. ఇటువంటి గొప్ప తల్లిని కలిగి ఉండటం రాజమౌళి గారు చేసుకున్న అదృష్టం అనటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఇంత చెప్పుకున్న తరువాత ఆ మాతృమూర్తి పేరు తెలుసుకోకపోతే ఎలా? రాజమౌళి గారి తల్లి పేరు ” రాజ నందిని ” ఆమెకు శతకోటి వందనాలు..!!