in

script demand, 3 heroines in for balayya’s next!

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఎమోషన్స్ ప్రధానంగా సాగే మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సితార బ్యానర్లో ఇంతవరకూ వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో హీరో జర్నీ మూడు దశలలో కొనసాగుతుంది.

అంటే మూడు కాలాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందన్న మాట. ఆయన జీవితంలోని ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ ఆయనకి తారసపడుతుంది. ఇప్పటికే ఊర్వశి రౌతేలా .. మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం జరిగిపోయింది. ప్రస్తుతం బాలయ్యతో పాటు ఈ ఇద్దరు బ్యూటీల కాంబినేషన్ లోని సీన్స్ ను ‘ఊటి’లో చిత్రీకరిస్తున్నారు. ఇక మరో హీరోయిన్ కోసం వెతికే పనిలో టీమ్ ఉందని అంటున్నారు. ఇప్పుడు రానున్నదే మెయిన్ హీరోయిన్ అని చెబుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నారని టాక్..!!

no business for rajinikanth’s re-releases!

big relief for prabhas fans!